పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్
ELR: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గుడి సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులుని పోలీసులు గురువారం అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6, 370 నగదు స్వాధీనం చేసుకొని వారిపై తదుపరి చర్యల నిమిత్తం లక్కవరం పోలిస్ స్టేషన్‌కి తరలించారు. గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.