సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు.. ఫోటో షేర్ చేసిన లోకేష్
GNTR: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను ఇవాళ మంత్రి లోకేష్ 'X'లో పోస్ట్ చేశారు. 'ఈ పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక మధురమైన జ్ఞాపకం. కుటుంబ శ్రేయస్సుతోపాటు, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు.