మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉందా..?
KMR: కామారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లోని 25వ గదిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ఈ సెల్ పని చేస్తుంది. ప్రజలు తమ నీటి సమస్యలపై ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9908712421 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.