ఆరుగురికి CMRF చెక్కులు పంపిణీ

ఆరుగురికి CMRF చెక్కులు పంపిణీ

అనకాపల్లి పట్టణ పరిధిలో ఆరుగురికి CMRF చెక్కులను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు ఆదివారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకున్న ఆరుగురికి ‌రూ.1.82 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకుగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.