సరిహద్దుల్లో యుద్ధం.. జిల్లా ఎస్పీ హెచ్చరికలు

సరిహద్దుల్లో యుద్ధం.. జిల్లా ఎస్పీ హెచ్చరికలు

కృష్ణా: పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, ఆడియో, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు హెచ్చరించారు. వాస్తవాలు నిర్దారించకుండా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చట్టవ్యతిరేకమైన సమాచారం షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.