గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కర్నూలు: కోడుమూరు భారత్ పెట్రోల్ బంకు దగ్గర మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. క్షతగాత్రున్ని దేవనకొండ మండలం బండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.