ప్రజల విజ్ఞప్తి.. బ్రిడ్జిని బాగు చేయండి
కృష్ణా:పెడన-విస్సన్నపేట NH-216లో భాగంగా హనుమాన్‌జంక్షన్ పైవంతెన ఆధ్వానంగా తయారైంది. ఎక్కడిక్కడ గోతులు పడటం,పలు చోట్ల ఇనుప చువ్వలు బయటకు రావడంతో వాహనదారులు బ్రిడ్జిపై ప్రయాణం చేయాలంటనే బెంబేలెత్తిపోతున్నారు. గతంలో రూ.50 లక్షలతో మరమ్మతులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైన కూటమి ప్రభుత్వమైనా బ్రిడ్జిని పట్టించుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.