రేపు ముద్దనూరు మండల సర్వ సభ్య సమావేశం

ముద్దనూరు: మండల ప్రజా పరిష్యత్ కార్యాలయ సభా భవనంలో గురువారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ ముకుందరెడ్డి పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల మండల అధికారులు, కార్యదర్శులు ఈ సభకు తప్పక హాజరు కావాలని ఎంపీడీఒ కోరారు. తాగునీరు, పారిశుధ్యం, ఉపాధి, ఇళ్లు,రోడ్లు వంటి మొదలైన అంశాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.