మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

W.G: కోళ్లపర్రు హరిజనపేట ప్రాంతానికి చెందిన కుమారి అనే మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఆకివీడు ఎస్సై హనుమంత తెలిపారు. ఈ నెల 1న కుమారి తన అక్క ఇంటికి కోనాలపల్లి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేపట్టారు.