VIDEO: సచివాలయంలో తహసీల్దార్ తనిఖీ
KDP: వీరబల్లి మండలం సానిపాయ సచివాలయాన్ని ఇవాళ తహసీల్దార్ ఖాజాభి సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పాస్ పుస్తకాలు, ఆధార్, ఫోన్ వివరాల్లో పొరపాట్లు సరిచేయాలని సూచించారు. సిబ్బంది పనితీరుపై పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ వివరాలను సకాలంలో నవీకరించుకోవాలని అవగాహన కల్పించారు. సేవల అందజేతలో పారదర్శకత, వేగం పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.