రైతు బజార్లో దళారులను తొలగించాలని కలెక్టర్‌కు వినతి

రైతు బజార్లో దళారులను తొలగించాలని కలెక్టర్‌కు వినతి

కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్లో దళారీలను తొలగించి, నిజమైన రైతులకు అవకాశం కల్పించాలని బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, చొల్లంగి వేణుగోపాల్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కోరారు. నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్డును వెంటనే అమలు చేయాలని, రైతు బజార్ వద్ద ఆక్రమణల వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.