VIDEO: పన్ను వివాదం పంచాయతీ కార్యదర్శిపై దూషణలు
WGL: రాయపర్తి మండలంలోని గణేష్‌కుంట తండాలో ఇంటి పన్ను చెల్లించాలంటూ కోరిన పంచాయతీ కార్యదర్శిపై స్థానికుడు మునవత్ లచ్చు నాయక్ దుర్భాషలాడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పన్ను విషయంపై వివాదం తలెత్తడంతో కార్యదర్శిని నోటికి వచ్చినట్లు దూషించిన వీడియో సామాజిక మాధ్యంలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.