ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్.. 38 మందిపై వేటు.!
కడప: జిల్లా పరిధిలో 38 మంది ITI(ఎలక్ట్రిషియన్) చదవకుండానే పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి, జాబ్‌లో చేరినట్లు విచారణలో వెల్లడైందని APSPDCL CMD శివశంకర్ వివరించారు. కడప పరిధిలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన 38 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. పలు జిల్లాలలో జరిగిన విచారణలో ఈ అనర్హ నియామకాలు బయటపడ్డాయని తెలిపారు.