గౌహతిలో పెనమలూరు ఎమ్మెల్యే పర్యటన
కృష్ణా: పెనమలూరు MLA బోడే ప్రసాద్‌కు గౌహతిలో టీడీపీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాగుతుందని, అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.