VIDEO: ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్

VIDEO: ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్

అన్నమయ్య: రాజంపేటలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డిని మన్నూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి, ప్రెస్ మీట్‌ పెట్టాలనుకున్న ఆయనను ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.