వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తుమ్మల
TG: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. క్లౌడ్ బరస్ట్‌తో వరంగల్ జిల్లాలో వరదలు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుందని అన్నారు. అలాగే రేపు వరంగల్‌లో CM రేవంత్ ఏరియల్ సర్వే ఉంటుందని, ఆస్తి, పంటనష్టంపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.