ఓయూ ACEగా డాక్టర్ రాధిక నియామకం

HYD: ఉస్మానియా యూనివర్సిటీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్(ACE)గా డాక్టర్ ఎస్వీఎస్ఎన్డీఎల్ రాధిక నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు సోమవారం ఓయూ వీసీ నియామక పత్రాన్ని అందజేశారు. ఆమె ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందించారు.