గొల్లపల్లిలో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ'

గొల్లపల్లిలో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ'

VZM: బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బుధవారం స్థానిక గొల్లపల్లి 10వ వార్డులో 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.