ప్రభుత్వ పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం: కలెక్టర్
WGL: జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం సాయంత్రం విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, పరీక్షల సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తినిచ్చే విధంగా శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారూ.