సైన్యానికి అందుబాటులో 13,700 అడుగుల ఎత్తు ఎయిర్‌ఫీల్డ్
చైనా సరిహద్దుకు సమీపంలో లద్దాఖ్‌లో ఏకంగా 13,700 అడుగుల ఎత్తులో నిర్మించిన ఎయిర్‌ఫీల్డ్.. భారత రక్షణ విభాగానికి అందుబాటులోకి వచ్చింది. ఈ న్యోమా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ALG) ఇప్పుడు భారత సేనలకు పూర్తిస్థాయిలో సేవలందిస్తుందని రక్షణ వర్గాలు తెలిపాయి. చైనా అత్యంత సమీపంలో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్.. డిఫెన్స్ కనెక్టివిటీకి కీలకం కానుంది.