వేసవిలో తాగునీటి కష్టాలు రావొద్దు: సీతక్క

వేసవిలో తాగునీటి కష్టాలు రావొద్దు: సీతక్క

TG: రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనితీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేసవి అవసరాలకు తగినట్లుగా నీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. పైపులైన్ మరమ్మతులు ఉంటే వేగంగా పూర్తి చేయాలని సూచించారు.