గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
KRNL: ఆదోని-ఆలూరు నూతన బైపాస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదోని శివారులో జింకలు సంచరిస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా నడపాలని అధికారులు హెచ్చరించారు.