ఆక్రమణదారులతో సమావేశం నిర్వహించిన ఎస్సై

ఆక్రమణదారులతో సమావేశం నిర్వహించిన ఎస్సై

కృష్ణా జిల్లా పామర్రులోని కూచిపూడి గ్రామంలో ఎస్సై చావా సురేష్ ఆక్రమణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పసుమర్తి వారి ధర్మ చెరువు చుట్టూ, ఆర్ అండ్ బి రోడ్డు (బార్లపూడి) పక్కన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలంగించి, గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో 42 మంది ఆక్రమణదారులు పాల్గొన్నట్లు తెలిపారు.