ఫరూఖ్ నగర్‌లో 34 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్
RR: గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలో మొత్తం 34 మంది సర్పంచ్ అభ్యర్థులు, 19 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా నామినేషన్లను ఎంపీడీవో బన్సీలాల్ స్వీకరించారు. కాగా, డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.