“మీ గ్రామానికి గ్యాస్ బండి రాదు”
SRPT: అనంతగిరి మండలంలో గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం, అదనపు వసూళ్లు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బుక్ చేసుకున్న వినియోగదారుల ఇళ్లకు సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉండగా “మీ గ్రామానికి గ్యాస్ బండి రాదు” అని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఒక్కో సిలిండర్‌పై రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.