పనిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్ ఓ
SRPT: విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. మంగళవారం నూతనకల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.