హోంగార్డు కుటుంబానికి పోలీసుల సహాయం

హోంగార్డు కుటుంబానికి పోలీసుల సహాయం

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పవన్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లా హోంగార్డులు తమ ఒక్క రోజు అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ. 2,30,000లు సేకరించిన చెక్కును ఎస్పీ ధీరజ్ సోమవారం తన కార్యాలయంలో పవన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.