అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు కల్పించాలి: BRS
NLG: అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. సోమవారం వేములపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ హేమలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూములకు పీవోటీ 1977 చట్టం సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.