'ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది'
కృష్ణా: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. శనివారం మోపిదేవి మండలం పెద్దప్రోలులో ధాన్యం ఆరబెట్టుకున్న రైతులతో మాట్లాడారు. రైతులు గ్రామాల్లో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.