5 రూపాయల కాయిన్ మింగిన బాలుడు

5 రూపాయల కాయిన్ మింగిన బాలుడు

NGKL: కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే బాలుడు అనుకోకుండా రూ.5 కాయిన్ మింగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ జగదీశ్ ఆధ్వర్యంలో ఎండోస్కోప్ విధానంలో చికిత్స జరిపించి కాయిన్ బయటికి తీశారు.