'వరి కొనుగోలులో జాప్యం'

'వరి కొనుగోలులో జాప్యం'

 MNCL: జిల్లాలోని జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో పీఎసీఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు సరిగా జరగడం లేదని స్థానిక రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం వచ్చినప్పటికీ రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టం జరిగితే, బాధ్యత ఎవరిదని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.