కే. ముంజవరంలో పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే

కే. ముంజవరంలో పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే

కోనసీమ: పీ. గన్నవరం మండలంలోని కే.ముంజవరం గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను బుధవారం పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా ఏ విధమైన ఆటంకాలు లేకుండా 1న నాడే లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తుందని తెలిపారు.