ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పీడీ విజ్ఞప్తి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పీడీ విజ్ఞప్తి

KMR: బాన్సువాడ మండలం కోనాపూర్, సంగోజిపేటలో పీడీ హౌసింగ్ పి. విజయపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు నిర్మాణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఇళ్ల నిర్మాణ దశకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు.