గాజులరామారంలో కంపించిన భూమి..!

గాజులరామారంలో కంపించిన భూమి..!

HYD: గాజులరామారంలో నేడు ఉదయం 10:10 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా పెద్ద శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా ఉలిక్కిపడ్డ ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గేటెడ్ అపార్ట్మెంట్ల వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక పేలుడు శబ్దమా అనే అనుమానంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.