నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాట్ల పనులు పరిశీలన
ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీలంక కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాట్ల పనులను ఏడీ నాగేంద్ర కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలు లేక కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేదన్నారు. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.