VIDEO: 'మహిళలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు'
కృష్ణా: తిరువూరు(M) కోకిలంపాడులో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP ఆధ్వర్యంలో మంగళవారం 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్ని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైద్యాన్ని బడుగు బలహీన వర్గాలకు దూరం చేస్తుందన్నారు. 17 నెలలు గడిచిన మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రూ. 1500 ఇవ్వలేదన్నారు.