తాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
KRNL: ఆదోనిలో వారం రోజులుగా నీరు లేక ఇబ్బందులు పడుతున్న మహిళలు బిందెలతో కలిసి ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిను ఆశ్రయించారు. బెండిమెట్టా, కరెప్పా హాస్టల్ ప్రాంతాల్లో 7–10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వెంటనే స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులకు ట్యాంకర్లు పంపాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కాకపోతే తానే అక్కడికి వస్తానని హెచ్చరించారు.