బాధిత కుటుంబానికి CMRF చెక్కు అందజేత
SRPT: హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన దొంతగాని సోమయ్య గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును గురువారం బాధితుడి భార్య కనకమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లపు దాసు కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.