'కనిగిరి నగర వన అభివృద్ధికి పనులు చేపట్టాలి'

'కనిగిరి నగర వన అభివృద్ధికి పనులు చేపట్టాలి'

ప్రకాశం: కనిగిరి అటవీ రేంజ్ పామూరు సెక్షన్ కోడిగుంపల బీట్‌లో గల నానాజాతి మొక్కల ప్లాంటేషన్‌ను మంగళవారం గుంటూరు సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి ఐకేవీ రాజు పరిశీలించారు. ప్లాంటేషన్ తదుపరి పనులను చేయాలని ఆదేశించారు. కనిగిరి నగర వన అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. జిల్లాలో పులుల గణన వెంటనే చేపట్టాలని డీఎఫ్‌వో కే. వినోద్‌ను ఆదేశించారు.