VIDEO: పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించారు: శ్యామల
PLD: గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులను పథకం ప్రకారమే ఇరికించారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలా రెడ్డి ఆరోపించారు. మాచర్ల కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు పిన్నెల్లి సోదరులు సమాధానం ఇచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, న్యాయం గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.