విజయ్‌.. గాల్లో మేడలు కడుతున్నారు: వైగో

విజయ్‌.. గాల్లో మేడలు కడుతున్నారు: వైగో

టీవీకే అధినేత విజయ్‌పై ఎండీఎంకే చీఫ్ వైగో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో కనీసం ఓనమాలు కూడా తెలియని విజయ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీవీకే-డీఎంకే మధ్యే ఉండనుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీవీకే అధినేత గాల్లో మేడలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయన కలలన్నీ ఎండమావిలా మారతాయని ఎద్దేవా చేశారు.