నాగార్జునసాగర్‌లో ఏఎస్‌వో అధికారుల పర్యటన
NLG: భారత్ దర్శన్‌లో భాగంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ASOS) బృందం మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించింది. అమర్జిత్ సింగ్ నాయకత్వంలో వచ్చిన 70 మంది అధికారులు సాగర్ డ్యామ్, నాగార్జునకొండ మ్యూజియంలను వీక్షించారు. అనంతరం బుద్ధవనంలోని స్తూపవనాలు, జాతక విభాగాలను సందర్శించి, ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.