చిలకలూరిపేటలో రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
PLD: చిలకలూరిపేట పట్టణంలోని రెండు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రేషన్ నిల్వల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 605 కిలోల బియ్యం, 121 ప్యాకెట్ల చక్కెరను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై కేసు నమోదు చేశారు.