ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని వినతి

ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని వినతి

ATP: గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఆసుపత్రి సూపరిండెంట్  జయవర్ధన్‌కు డివైఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు షాషా, సురేంద్రబాబు, నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి, మందులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.