కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన MLA
జగిత్యాల రూరల్ మండలం పొలాస పౌలేస్తేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామి వారి దర్శనం శీఘ్రంగా అయ్యేలా చూడాలని సభ్యులను కోరారు.