VIDEO: 'వరి కొయ్యలు కాల్చడం వల్ల భూసారం తగ్గుతుంది'
పెద్దపల్లి జిల్లాలో వరి కోతల అనంతరం కొయ్యలు కాల్చివేయడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూసారం తగ్గి, వానపాములు, సూక్ష్మజీవులు నశిస్తున్నాయన్నారు. పొగ కారణంగా గ్రామాల్లో గాలి నాణ్యత దిగజారి వృద్ధులు, పిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు అవశేషాలను తగులబెట్టడం మానేసి, వాటిని నేలలో కలిపి కాంపోస్టుగా ఉపయోగించుకోవాలన్నారు.