యువకుడిపై పోక్సో కేసు నమోదు
GNTR: గోరంట్ల బాలాజీనగర్‌కు చెందిన దేవళ్ల కొండా అలియాస్ పండు అనే యువకుడిపై నల్లపాడు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటు తాపీ పనులు చేస్తూ ఉంటే కొండా అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆమెను వేధించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.