ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరు చేయాలి: కమిషనర్

KNR: ప్రతి రోజు తడి, పొడి చెత్తను వేరు చేయడంవల్ల డంపింగ్ యార్డ్‌లో చెత్త పేరుకపోదని కరీంనగర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మల్కాపూర్, లక్ష్మీపూర్, కొత్తపల్లిలో పర్య టించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. గతంలో వినియోగించిన డంపు యార్డ్ వద్ద వర్మి కంపోస్ట్‌ను పరిశీలించారు. చెత్తను వేరుచేసి వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారు చేయాలన్నారు.