'ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలి'
NLG: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇవాళ ఆమె నల్లగొండ మండలంలోని దండంపల్లిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.