'జిల్లా అప్రమత్తంగా ఉంది'

కృష్ణా: వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నామని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంత్రి అనితకు వివరించారు. 62 దుర్బల గ్రామాలు, 16 లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, బోట్లు, రవాణా సదుపాయాలు సిద్ధం చేశామని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బుధవారం 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.